![]() |
![]() |

బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి రీసెంట్ గా చాలా ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. మాజీ కంటెస్టెంట్స్ అంతా వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి చెప్తున్నారు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 పార్టిసిపెంట్ అర్జున్ అంబటి న్యూ బిగ్ బాస్ అగ్నిపరీక్ష గురించి చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9 ని కొత్తగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు ఒక్క కామనర్ కె అవకాశం ఉండేది కానీ ఇప్పుడు చాలామంది కామనర్స్ కి అవకాశం ఇచ్చారు. ఐతే వీళ్ళు డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి టెన్షన్ పడకుండా ఉండడానికి అలాగే వామప్ లా ఉండడానికి బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ అలవాటు పడడానికి కానీ అగ్ని పరీక్ష అనే గోల్డెన్ కాన్సెప్ట్ తెచ్చారు. ఈ అగ్ని పరీక్షలో పాస్ ఐనవాళ్ళే రియల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు.
ఎక్కువ ఫుటేజ్ లో కనిపించడం కోసం ఎక్కువగా గొడవలు పడడం వంటివి అస్సలు చేయొద్దు. ఎందుకంటే అసలు మొదటేమయ్యింది, మధ్యలో ఎం చేశారు, లాస్ట్ లో ఏమయ్యింది అనే విషయాన్నీ అందరూ మర్చిపోతారు. దాంతో మీరు దొరికి పోయే ఛాన్స్ ఉంది. సింపుల్ సూత్రం ఏంటంటే మీరు గెలవడం కోసమే ఆడండి. ఇక టాస్క్స్ అంటారా అన్నీ గెలవాలని లేదు..అందరూ అన్ని ఆడలేరు. కొన్ని గెలవచ్చు కొన్ని ఓడిపోవచ్చు...ఈ అగ్నిపరీక్ష దాటాలి అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే గేమ్స్ టాస్క్స్ ఆడడమే కాదు...మీ వ్యక్తిత్వాన్ని, కొన్ని సందర్భాల్లో ఎలా సర్వైవ్ అవుతారో తెలుసుకోవడానికి కొంతమంది జడ్జెస్ టఫ్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు. వాళ్లనే బిగ్ బాస్ సీజన్ 9 న్యూస్ హౌస్ లోకి పంపిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం రెడీ అవ్వండి. మీలా మీరు ఉండండి. హౌస్ లో మీ కోసమే ఆడండి.
![]() |
![]() |